ETV Bharat / state

రామోజీ ఫిల్మ్‌ సిటీకి అత్యుత్తమ 'ఆతిథ్య' పురస్కారం

Ramoji Film City won the Hospitality Award రామోజీ ఫిల్మ్‌ సిటీకి అత్యుత్తమ 'ఆతిథ్య' పురస్కారం దక్కింది. పర్యాటక, ఆతిథ్య రంగాల ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న రామోజీ ఫిల్మ్‌ సిటీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు దక్షిణ భారత హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ (సిహ్రా) ప్రకటించింది.

Ramoji Film City
Ramoji Film City
author img

By

Published : Nov 18, 2022, 9:33 AM IST

Ramoji Film City won the Hospitality Award దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక, ఆతిథ్య సేవల పురస్కారం రామోజీ ఫిల్మ్‌ సిటీకి దక్కింది. పర్యాటక, ఆతిథ్య రంగాల ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న రామోజీ ఫిల్మ్‌ సిటీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు దక్షిణ భారత హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ (సిహ్రా) ప్రకటించింది. బెంగళూరులోని షాంగ్రిలా హోటల్‌లో శుక్రవారం నిర్వహించే సమాఖ్య వార్షిక సమ్మేళనంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొని.. రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ సీహెచ్‌ విజయేశ్వరికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు.

విశాఖపట్నంలోని నోవోటెల్‌తోపాటు దక్షిణాదికి చెందిన 19 హోటళ్లు, రిసార్ట్‌లకు వివిధ విభాగాల్లో పురస్కారాలను అందిస్తామని నిర్వాహక సంఘం అధ్యక్షుడు కె.శ్యామరాజు వెల్లడించారు. ఈ సమ్మేళన ప్రారంభోత్సవానికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కర్ణాటక పర్యాటకశాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మంత్రులు హాజరవుతారని చెప్పారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.