అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నుంచి విద్యుత్ తయారీ చేసే ప్లాంట్ మంగళవారం ప్రారంభించామని రాంకీ ఎండీ గౌతమ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్.. దక్షిణ భారతదేశంలోనే మొదటిదని వెల్లడించారు. ప్రతి రోజు 1200 టన్నుల చెత్త నుంచి సుమారు 20 మెగా వాట్ల వరకు విద్యుత్ తయారు చేస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరో రెండు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెబుతున్న రాంకీ ఎండీ గౌతమ్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చదవండి: దేశంలోనే మోడల్ ప్లాంట్‌గా జవహర్‌నగర్ 'వేస్ట్ టు ఎనర్జీ'