ప్రార్ధించే పెదవుల కన్నా, సహాయం చేసే చేతులే మిన్నా అని.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కేవీ.రమణాచారి అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ బొగ్గుల కుంటలోని ఎండోమెంట్ కార్యాలయంలో మైటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నందపాండే, డా.రంగనాధ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమంలో రమణాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల శాఖ కమిషనర్‌తో కలిసి 10 మంది వికలాంగులకు ఆయన వీల్ ఛైర్స్, నిత్యావసర సరుకులతో పాటు.. నగదును పంపిణీ చేశారు.
తమ దగ్గర ఉన్నదాంట్లో ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మానవ లక్షణమని రమణాచారి పేర్కొన్నారు. ఓ స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు.
ఇదీ చదవండి:ఏసీబీ వలకు చిక్కిన అబిడ్స్ ఏసీటీవో, ట్యాక్స్ ఇన్స్పెక్టర్