ETV Bharat / state

సరికొత్తగా రక్షాబంధన్​ గిఫ్ట్​.. సోదరికి సిప్‌ బహుమతి - రక్షాబంధన్

Raksha Bandhan gifts: రాఖీ కట్టిన సోదరికి ఎప్పటికీ రక్షగా ఉంటాననే నమ్మకం కలిగించాల్సిన బాధ్యత సోదరులపై ఉంటుంది. ఎల్లవేళలా రక్షణగా ఉంటూనే.. తనకు భరోసా కల్పించే బహుమతులనూ ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం. మరి, ఇలాంటి ఆర్థిక భద్రత కల్పించేందుకు సోదరికి మీరు ఎలాంటి కానుకలు ఇస్తే బాగుంటుందో తెలుసుకుందాం..

Raksha Bandhan gifts
సోదరికి సిప్‌ బహుమతి
author img

By

Published : Aug 12, 2022, 12:26 PM IST

Raksha Bandhan gifts: ‘డబ్బు ఇవ్వడం కాదు.. దాన్ని ఎలా సృష్టించాలో నేర్పించండి’ అని ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెప్పే మాటే. రక్షాబంధన్‌ వేళ మీ సోదరికి ఈ విషయాన్ని నేర్పించే బాధ్యతను తీసుకోండి. తనకు ఇప్పటివరకూ బ్యాంకు ఖాతా లేకపోతే.. తొలుత పొదుపు ఖాతాను ప్రారంభించండి. ఇప్పుడు బ్యాంకులు చిన్న పిల్లల పేరుమీదా బ్యాంకు ఖాతాలను అందిస్తున్నాయి. 18 ఏళ్లు నిండిన వారికి పూర్తి స్థాయి పొదుపు ఖాతా తీసుకోవచ్చు.

నెలకు రూ.500లతోనూ.. నేటి నుంచే మీ సోదరి పేరుమీద మీ ఆర్థిక శక్తిని బట్టి పెట్టుబడిని ప్రారంభించండి. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా ఈ బహుమతిని ఇవ్వండి. రూ.500 లేదా రూ.1,000తోనూ దీన్ని మొదలుపెట్టొచ్చు. ఈ సిప్‌ను ఆమె బ్యాంకు ఖాతాతో అనుసంధానించండి. నెలనెలా మీ ఖాతా నుంచి తన ఖాతాకు ఆ డబ్బు ముందుగా బదిలీ అయ్యేలా స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇవ్వండి. ఇది క్రమంగా సోదరి కోసం సంపదను సృష్టించేందుకు వీలు కల్గిస్తుంది. మీ ఆదాయం పెరిగినప్పుడల్లా.. పెట్టుబడి మొత్తాన్నీ పెంచుకోవచ్చు. తను ఆర్జించడం ప్రారంభించిన తర్వాత స్టెప్‌ అప్‌ సౌకర్యంతో మదుపును పెంచుకునే వీలుంటుంది. ఈ పెట్టుబడి ద్వారా జమైన మొత్తం తన భవిష్యత్‌ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలో తెలియజేయండి.

బంగారాన్ని ఇస్తారా.. సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో బంగారం ఒకటి. చాలామంది అమ్మాయిలకు ఇష్టమైన లోహం ఇది. మీ సోదరికి బంగారం బహుమతిగా ఇవ్వడం గొప్ప ఆలోచనే. కానీ, దీన్ని ఒకేసారి కాకుండా.. క్రమానుగతంగా ఇచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. గోల్డ్‌ ఫండ్లు లేదా గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లను ఇందుకోసం వినియోగించుకోవాలి. దీర్ఘకాలంపాటు బంగారంలో మదుపు చేయడం ద్వారా అవసరమైనప్పుడు తనకు ఇష్టం వచ్చిన ఆభరణాలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. మీ సోదరి సంతోషాన్ని ఇది రెట్టింపు చేస్తుంది.

ధీమాగా ఉండేలా.. కరోనా మహమ్మారి మనకు ఒక పాఠం నేర్పింది. ఆర్థిక, ఆరోగ్య భద్రత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో అవసరం. లేకపోతే మన భవిష్యత్‌ ప్రణాళిక మొత్తం విఫలం అవుతుంది. రక్షాబంధన్‌ వేళ మీ సోదరికి బీమా ధీమాను అందించండి. తనకు సరిపోయే ఆరోగ్య బీమా పాలసీని బహుమతిగా అందించవచ్చు. కొన్ని నిమిషాల్లోనే ఈ పాలసీని కొనుగోలు చేసే వీలుంది. ఇక సొంత కుటుంబం ఉన్న సోదరికి టర్మ్‌ పాలసీ కానుకగా ఇవ్వవచ్చు. అనుకోని సంఘటన వల్ల తన కుటుంబానికి ఆర్థిక కష్టం రాకుండా ఇది ఆదుకుంటుంది.

మీ సోదరి ‘ఆత్మనిర్భర్‌’గా ఉండేలా ఆర్థిక పరిజ్ఞానాన్ని నేర్పించండి. తన లక్ష్యాలు, వాటిని సాధించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై తనకు అవగాహన కలిగే ఏర్పాటు చేయండి. ఇది మీ సోదరికి మీరు ఇచ్చే విలువైన కానుక అవుతుంది. - వికాస్‌ సింఘానియా, సీఈఓ, ట్రేడ్‌స్మార్ట్‌

నిధి ఉందా.. అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు మీ సోదరి ఆందోళన చెందకుండా నిధి ఏర్పాటు చేయొచ్చు. తన 6-8 నెలల ఖర్చులను ఒక ప్రత్యేక నిధిగా ఏర్పాటు చేసి, కానుకగా ఇవ్వవచ్చు. అదే సమయంలో తన సంపాదనతోనూ ఇలాంటి నిధి ఒకటి ఉండేలా చూసుకోవాలని ప్రోత్సహించాలి. డీమ్యాట్‌ ఖాతాను ప్రారంభించి ఈక్విటీ ఫండ్లు, ఇండెక్స్‌ ఫండ్ల వంటి పథకాల్లో మదుపు చేసేలా ప్రోత్సహించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలైనా పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌లూ ఎంచుకోవచ్చు. జాతీయ పొదుపు పత్రాలు (ఎన్‌ఎస్‌సీ) బహుమతిగా ఇవ్వొచ్చు. ఆమెకున్న క్రెడిట్‌ కార్డు బిల్లులు, వ్యక్తిగత, వాహన రుణాల్లాంటివి తీర్చేయొచ్చు.

ఇవీ చదవండి: Eamcet Results: ఎంసెట్ ఫలితాలు విడుదల.. త్వరలోనే కౌన్సిలింగ్‌ ప్రారంభం

ప్రగతి పథంలో ప్రజా రథం.. 75 ఏళ్ల అభివృద్ధి యజ్ఞం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.