Rajiv swagruha towers for sale: రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ స్వగృహ టవర్లను అమ్మకానికి పెట్టింది. రెండు చోట్లా ఉన్న వాటిని టవర్ల వారీగా విక్రయించనున్నారు. పోచారంలో నాలుగు, గాజులరామారంలో ఐదింటిని టవర్లను అమ్మకానికి పెట్టారు. పోచారంలోని ఒక్కో టవర్లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉండగా... గాజుల రామారంలోని ఒక్కో టవర్లో 112 ఫ్లాట్లు ఉన్నాయి.
ఆసక్తి కలిగిన సంస్థలు, వ్యక్తులు టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ సమర్పించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తెలిపింది. ఈఎండీ సమర్పించేందుకు జనవరి 30 వ తేదీ వరకు గడువు ఇచ్చారు. లాటరీ ద్వారా టవర్లను కేటాయిస్తారు. www.hmda.gov.in , www.swagruha.telangana.gov.in వెబ్సైట్లలో టవర్ల వివరాలు, పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.
ఇవీ చదవండి :