రాష్ట్రంలో తప్పులులేని ఓటర్ల జాబితా తయారీ కోసం ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. ఓటర్లు తమ పేరు, ఫొటో, పుట్టిన తేదీ, వయసు, చిరునామా మార్పులు, తప్పుల సవరణలు అవసరమైన వాళ్లు సరిచేసుకోవాలని సూచించారు. నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓటర్ల సహాయ కేంద్రంతో పాటు ఓటరు హెల్ప్ లైన్, మొబైల్ యాప్, ఎన్నికల సంఘం ఎన్.వి.ఎస్.వి పోర్టల్, మీ-సేవా కేంద్రాల్లో, 1950 హెల్ప్ లైన్ ద్వారా కూడా సరిచూసుకునే అవకాశాన్ని కల్పించినట్లు చెప్పారు. దివ్యాంగుల కోసం డోర్ వెరిఫికేషన్ కూడా ఉంటుందని వివరించారు.
ఇవీ చూడండి: మన కొత్త గవర్నర్ తమిళిసై ప్రస్థానమిదీ...