నిజామాబాద్‌లో అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉన్నందున పోలింగ్ బ్యాలెట్ విధానంలోనా, ఈవీఎంల ద్వారానా అనేది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని రజత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. వచ్చే నెల 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు తీసుకోబోయే జాగ్రత్తల గురించి వివరించారు. 17 ఎంపీ స్థానాలకు గాను ఒకటి లేదా రెండు చోట్లు మాత్రమే బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరిపే అవకాశముందని రజత్ కుమార్ స్పష్టం చేశారు.
'ఈసీ పరిశీలనలో నిజామాబాద్ ఎన్నిక'
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎన్నికలు ఎలా జరుపుతామనేది రెండ్రోజుల్లో తెలుస్తుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఘటనలు జరిగినా ప్రజలు సీ-విజిల్ యాప్ ద్వారా తమ ఫిర్యాదులను తెలపాలని సూచించారు.