ETV Bharat / state

తహసీల్దార్‌ వినూత్న ఆలోచన... ప్రమాణ పత్రంతో లంచాలకు అడ్డుకట్ట - Srikakulam district latest news

రెవెన్యూ కార్యాలయాల్లో అధికారుల చేయి తడిపితే కానీ పని కాదు. ఈ పద్ధతికి స్వస్తి చెప్పేందుకు ఏపీ శ్రీకాకుళం జిల్లా రాజాం తహసీల్దార్‌ పప్పల వేణుగోపాలరావు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. లంచం ఇవ్వకుండానే పనులు జరిగేలా చూస్తున్నారు. అందరి మన్ననలు అందుకుంటున్నారు.

తహసీల్దార్‌ వినూత్న ఆలోచన... ప్రమాణ పత్రంతో లంచాలకు అడ్డుకట్ట

author img

By

Published : Dec 23, 2020, 2:20 PM IST

మీరు ఎవరికైనా లంచం ఇచ్చారా? మిమ్మల్ని ఎవరైనా డిమాండ్‌ చేశారా? అని అక్కడి అధికారులు ఆరా తీస్తారు. 'లేదు'... అని మీరు సమాధానం చెబితే ఆ మేరకు లిఖితపూర్వకంగా మీ నుంచి ప్రమాణ పత్రం తీసుకుంటారు. ఏపీ శ్రీకాకుళం జిల్లా రాజాం తహసీల్దార్‌ పప్పల వేణుగోపాలరావు ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

ఈ రెవెన్యూ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో నిత్యం వివిధ పనులపై జనం వస్తుంటారు. పని పూర్తయ్యాక వారందరినీ అన్ని వివరాలతో తహసీల్దార్‌ విచారిస్తున్నారు. ఎవరికీ లంచం ఇవ్వలేదని వారు చెప్పాకా.. ఆ మేరకు లేఖ తీసుకుంటున్నారు. లంచం ఇవ్వకుండానే పనులు జరుగుతున్నాయన్న విషయాన్ని మరో పది మందికి చెప్పాలని సూచిస్తున్నారు. దీని వల్ల ఎవరైనా లంచం అడిగితే ప్రశ్నించేందుకు వీలుంటుందనేది ఆయన భావన. ఇది పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

నాణ్యమైన సేవలందించాలనే...
పాలనలో పారదర్శకత కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ప్రజలకు నాణ్యమైన సేవలందించాలన్నదే నా ధ్యేయం. రూపాయి ఖర్చు లేకుండా పొందగలుగుతున్నామని వారికి అనిపించాలి. యంత్రాంగానికీ పేరు రావాలి. ఈ ఆలోచనతో పాటు సమస్యలు వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాను. ఇందుకు మిగిలిన సిబ్బంది సహకరిస్తున్నారు- పప్పల వేణుగోపాలరావు, తహసీల్దార్‌, రాజాం

  • భూ సమస్య పరిష్కారం

నాకు గ్రామంలో కొంత భూమి ఉంది. నా కుమార్తె వివాహానికి డబ్బులు అవసరమై భూమిని విక్రయించాను. సర్వే నంబరు తేడాగా ఉన్నట్లు తేలగా సరిచేయాలని అర్జీ పెట్టాను. గ్రామ స్థాయిలో సర్వే నిర్వహించి సరిచేశారు. ఎవ్వరికీ రూపాయి లంచం ఇవ్వకుండానే పని జరిగేలా తహసీల్దార్‌ చొరవ చూపారు. నా నుంచి లిఖితపూర్వకంగా ఎవరికీ లంచం ఇవ్వలేదని తీసుకున్నారు. అన్ని శాఖల్లో ఈ విధానం అమలుచేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. - జి.రాము, కంచరాం

  • పేరు మార్చారు

మా కుటుంబానికి చెందిన 28 సెంట్ల భూమికి మ్యుటేషన్‌ (పేరు మార్పు) కోసం సంప్రదించాను. అర్జీ పెట్టాక గ్రామానికి సర్వేయర్‌ను పంపి పరిశీలించారు. అంతా సరిపోయిందని తేలాక మా నాన్న లక్ష్మినారాయణ పేరున మ్యుటేషన్‌ చేశారు. మా నాన్నతో కలిసి నేను తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాను. ఎవరికైనా లంచం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎవరికీ ఇవ్వలేదని చెప్పాం. ఆ మేరకు మా నుంచి ప్రమాణ పత్రం తీసుకున్నారు - కొయ్యాన జనార్దన, ఎంజే వలస

ఇవీ చూడండి: 'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.