మంత్రి ఈటల రాజేందర్‌ను వైద్యారోగ్య శాఖ నుంచి సీఎం కేసీఆర్ తప్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు రాజయ్య ముదిరాజ్ అన్నారు. శామీర్‌పేటలోని మంత్రి నివాసానికి వెళ్లి ఆయనకు మద్దతు ప్రకటించారు.
అందరి బాగోగులు చూస్తూ, ఆరోగ్య శాఖ మంత్రిగా కరోనా వేళ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న మంత్రిని ఆ శాఖ నుంచి తప్పించడం సరికాదని అన్నారు. బీసీ వ్యతిరేక ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం?