ETV Bharat / state

నేటితో ముగియనున్న వర్షాకాల సమావేశాలు!

వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగిసే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో సమావేశాలను ముందుగానే ముగించేందుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ సహా పట్టణాల్లో మౌళిక సదుపాయాలపై అసెంబ్లీలో, విద్యుత్ సంబంధిత అంశాలపై కౌన్సిల్‌లో నేడు స్వల్పకాలిక చర్చ జరగనుంది.

వర్షాకాల సమావేశాలు నేటితో ముగిసే అవకాశం!

author img

By

Published : Sep 16, 2020, 5:04 AM IST

నేటితో ముగియనున్న వర్షాకాల సమావేశాలు!

కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో పూర్తిస్థాయి జాగ్రత్తలతో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అవసరమైన మేరకు పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోగా... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశారు. నెగటివ్ ఉంటేనే సమావేశాలకు రావాలని స్పష్టం చేశారు. మొదటివారం పూర్తైన వెంటనే మరోమారు అందరికీ పరీక్షలు తప్పనిసరి చేశారు. ఆదివారం నుంచి పరీక్షలు చేస్తున్నారు.

పలువురికి కరోనా..

సోమవారం ఒక ఎమ్మెల్యే సహా పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. మంగళవారం కూడా మరికొంత మందికి వైరస్ నిర్ధరణ అయింది. సమావేశాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే పేషీల్లోనూ... కొందరికి కరోనా సోకింది. ఈ పరిస్థితుల్లో సమావేశాలను ముందుగానే ముగించాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ బిల్లులు కూడా అన్నీ పూర్తయ్యాయి. ఈ మేరకు శాసనసభాపక్ష నేతలతో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశమై చర్చించారు.

నేడు మరోసారి చర్చ..

నేడు మరోసారి చర్చించి సమావేశాల కుదింపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపడతారు. విద్యుత్ సంబంధిత అంశాలపై శాసనపరిషత్తులో లఘు చర్చ ఉంది.

ప్రశ్నోత్తరాల్లో..

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో రైతుబంధు సాయం, ఆరోగ్యలక్ష్మి, యూరియా సరఫరా, మాతా, శిశు సంరక్షణా కేంద్రాలు, కరోనా కారణంగా డిజిటల్ బోధన, మధ్యాహ్న భోజన పథకం అంశాలు చర్చకు రానున్నాయి. కౌన్సిల్ ప్రశ్నోత్తరాల్లో జీహెచ్​ఎంసీ- జలమండలికి బడ్జెట్ కేటాయింపులు, దివ్యాంగుల ధ్రువపత్రాల జారీ, అనీస్-ఉల్-గుర్బా నిర్మాణం, వార్డు అధికారుల నియామకం, వేయి స్తంభాల గుడి అభివృద్ధి, మైనార్టీలకు గురుకుల కళాశాలలు ప్రస్తావనకు రానున్నాయి.

ఇదీ చూడండి: ఎస్​సీఓ భేటీలో పాక్​ తప్పుడు మ్యాప్​.. భారత్​ వాకౌట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.