దక్షిణ కోస్తా ఒడిశా పరిసర ప్రాంతాల్లో 3.6 కి.లో నుండి 5.8 కి.లో ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం సంచాలకురాలు నాగరత్న తెలిపారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రేపు ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గురువారం వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నగర్ కర్నూల్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, జనగామ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె వివరించారు.
ఇవీ చూడండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ