ETV Bharat / state

రాష్ట్రంలో పలు చోట్ల దంచికొడుతున్న వర్షాలు.. స్తంభించిన జనజీవనం - Latest news of rain in Hyderabad

Rains In Telangana Toady: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు వికారాబాద్‌ జిల్లాను అతలాకుతలం చేశాయి. పలుచోట్ల రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలో జోరుగా వర్షాలు కురవగా.. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో మోస్తరు వాన పడింది.

Rains In Telangana Toady
Rains In Telangana Toady
author img

By

Published : Oct 6, 2022, 7:40 PM IST

రాష్ట్రంలో పలు చోట్ల దంచికొడుతున్న వర్షాలు.. స్తంభించిన జనజీవనం

Rains In Telangana Toady: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల జోరు వానలు కురుస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. తాండూర్‌ కాగ్న నది, కోకట్‌ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగు ఉప్పొంగటంతో తాండూరు - ముద్దయిపేట్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధరూర్ మండలం నాగారం వద్ద ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. రహదారి దాటుతుండగా నీటిలో పడిపోయింది.

ప్రయాణికులు చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు. గమినించిన స్థానికులు నీటిలో కొట్టుకుపోతున్న వారిని కాపాడారు. తాళ్ల సహాయంతో కారును బయటకు తీశారు. కొడంగల్‌లోని పెద్ద చెరువు కట్ట.. భారీగా కోతకు గురై బుంగ పడింది. చిన్న బుంగ కాస్తా చూస్తుండగానే ఇరువైపులా మట్టిని చీల్చుకుంటూ పెద్దదిగా మారింది. దీంతో దిగువన పంట పొలాల్లోకి భారీగా వరద పోటెత్తింది. పట్టణంలోని వివిధ కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది.

పరిగిలో కుండపోత వర్షం: పరిగి పట్టణంలో కుండపోత వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. రహదారులు జలమలమయ్యాయి. దోమ మండలం గొడుగోనిపల్లి అంచున ఉన్న పెద్ద వాగు నిండుకుండలా పొంగిపొర్లుతోంది. వాగు నుంచి సుమారు 100 మీటర్ల పొడవు వరకు పంట పొలాల్లో భారీ వరద ప్రవహిస్తోంది. పరిగి-మహబూబ్‌నగర్‌ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. అల్లాపూర్ చెరువు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

జంట నగరాల్లో వర్షం: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలలో జోరు వాన పడింది. చిలకలగూడ, బేగంపేట్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మల్కాజ్‌గిరి, కీసర.. పంజాగుట్ట అంబర్‌పేట్, చిక్కడపల్లి, రాజేంద్రనగర్, శివరాంపల్లి, శంషాబాద్, ఆరాంఘర్, బండ్లగూడలో మోస్తరు వర్షం కురిసింది. రహదారులపై నీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ ,మేళ్లచెరువు, మఠంపల్లి, చింతలపాలెం మండలంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ఇవీ చదవండి: మహబూబ్​నగర్‌ను వీడని వరుణుడు.. వరదనీటితో ప్రజల ఇక్కట్లు

గేదె చెరువులో దిగిందని.. మహిళను నీటిలో ముంచి.. విచక్షణారహితంగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.