హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన వాన నీటి సంరక్షణ పార్కు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. వాన నీటి సంరక్షణతో పాటు... భవిష్యత్ తరాలకు నీటి పొదుపు ఆవశ్యకతను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. పార్కుకు వచ్చిన పిల్లలకు నీటి పాఠాలు చెబుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా వర్షపునీటి సంరక్షణ పద్ధతుల ఉద్యాన ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. నీటి పొదుపు గురించి వివరించేందుకు ఓ రోబోను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మొక్కల పెంపకంపై సందర్శకులకు అవగాహన కలిగించేలా ఏర్పాట్లు చేశారు. జలాన్ని సంరక్షించి... భూగర్భ జలాలు పెరిగేందుకు అధికారులు తీసుకుంటోన్న విధానాలపై ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ అందిస్తున్న కథనం...
ఇదీ చూడండి : కాళేశ్వరం చేపలు రాబోతున్నాయ్