ETV Bharat / state

రాజధానిలో భారీ వర్షం... తడిసి ముద్దయిన నగరం - heavy rain

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాజధాని తడిసి ముద్దయింది. సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. వర్షం నీటితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లాయి. కొన్ని చోట్ల విద్యుత్​ అంతరాయం ఏర్పడింది.  వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్​ స్తంభించింది.

రాజధానిలో భారీ వర్షం... తడిసి ముద్దయిన నగరం
author img

By

Published : Jul 12, 2019, 6:51 AM IST

రాజధానిలో భారీ వర్షం... తడిసి ముద్దయిన నగరం

భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. పలు చోట్ల భారీ వర్షంతో రోడ్లు జలమయమైపోయాయి. కొన్ని చోట్ల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ​ అంతరాయం ఏర్పడింది. సాయంత్రం వేళ కార్యాలయాల నుంచి వచ్చే ఉద్యోగులు, కళాశాలల నుంచి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలను వర్షం నీరు చుట్టుముట్టింది.

నగరవ్యాప్తంగా విస్తారంగా వాన

నగరంలోని ఇంచు మించు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. అమీర్​పేట్, లక్డీకాపూల్​, పంజాగుట్ట, ఖైరతాబాద్​, ఎర్రమంజిల్​, కూకట్​పల్లి, ఎస్సార్​నగర్​, బంజారాహిల్స్​, కోఠి, నాంపల్లి, బషీర్​బాగ్, ఓయూ క్యాంపస్​, నాచారం, తార్నాక, మల్లాపూర్​​ సహా చాలా చోట్ల వర్షం కురిసింది. పలు చోట్ల కుండపోత వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి.

రోడ్డుపై ఏరులా పారుతున్న నీరు.. చీకట్లో కాలనీలు

టోలిచౌకీలో రోడ్లపై వర్షం నీరు చెరువులను తలపించింది. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. చాలామంది మెట్రోను ఆశ్రయించడం వల్ల.. స్టేషన్లు కిటకిటలాడాయి. వర్షం దాటికి డ్రైనేజీలు పొంగి పొర్లాయి.

అకస్మాత్తుగా కురిసింది

ఉదయం నుంచి మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం పడలేదు. సాయంత్రం వేళ ఒక్కసారిగా వర్షం రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు తడుస్తూ ప్రయాణించారు. బాటసారులు రోడ్లు జలమయమై ఇబ్బందులు పడ్డారు.

ఇవీ చూడండి: ప్రకృతి ప్రేమికుల మనసు దోచే హుకో జలపాతం

Intro:hyd_tg_14_23_free health camp_ab_ c20_ Ts10010 kukatpally vishnu vardhanreddy ( ) ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు కూకట్పల్లి కే పి హెచ్ బి కాలనీ 13వ ఫేజ్ లో ఇమ్మాన్యుయేల్ ఫౌండేషన్ వారి ఇ సహకారంతో శిఫా హెల్త్ కేర్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో రక్తపోటు మధుమేహం ,మూత్ర సంబంధిత ,గుండె సంబంధిత పరీక్షలతోపాటు, స్త్రీ శిశు సంబంధ సమస్యల పరిష్కారానికి ఉచిత పరీక్షలు నిర్వహించి ,మందు లను అందజేశారు .చుట్టుపక్కల కాలనీలకు చెందిన ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మూత్ర సంబంధిత వ్యాధులను గుర్తించడం కోసం అధునాతన యంత్రాలు ప్రవేశపెట్టినట్లు ఆసుపత్రి సిబ్బంది యంత్రం గురించిన వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గా ఆసుపత్రి యాజమాన్యం శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలకు ఉచిత సేవలు అందించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇమాన్యుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి పలు వ్యాధుల కు సంబంధించి ఉచిత పరీక్షలు నిర్వహించి మందులను అందజేస్తామని తక్కువ ధరలో నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.. బైట్..శ్రీధర్ (ఆసుపత్రి యజమాని) బైట్..

Body:hhhh

Conclusion:uu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.