ETV Bharat / state

రైల్వే హమాలీలకు రైల్వే కమర్షియల్​ ట్యాక్స్ విభాగం చేయూత - railway hamalis

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో రైల్వే హమాలీలకు రైల్వే కమర్షియల్​ డిపార్ట్​మెంట్​ అధికారులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఉపాధి లేక అల్లాడుతున్న వారిని ఆదుకునేందుకు రైల్వే శాఖ ముందుంటుందని అధికారులు తెలిపారు.

railway officers groceries distribution in secunderabad railway station
రైల్వే హమాలీలకు రైల్వే కమర్షియల్​ ట్యాక్స్​ డిపార్ట్​మెంట్​ చేయూత
author img

By

Published : Apr 29, 2020, 9:12 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో రైల్వే హమాలీలను ఆదుకునేందుకు రైల్వే కమర్షియల్ ట్యాక్స్​ డిపార్ట్​మెంట్​ చేయూత అందించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్​ఫాం నెంబర్ 10 వద్ద రైల్వే హమాలీలకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రైల్వే కమర్షియల్ డిపార్ట్​మెంట్​ అధికారులు పాల్గొని వారికి నిత్యావసరాలు అందజేశారు.

నిరుపేద రైల్వే హమాలీ కుటుంబాలకు తమ వంతు సాయంగా నిత్యావసరాలు అందించినట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఉపాధి లేక అల్లాడుతున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని.. వారిని ఆదుకునేందుకు రైల్వేశాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని వారు తెలిపారు.సికింద్రాబాద్, నాంపల్లి, వరంగల్, మంచిర్యాల డివిజన్లలో ఉన్న హమాలీలందరికీ తాము సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వారికి నిత్యావసర సరకులతో పాటు 500 రూపాయల నగదు కూడా అందజేసినట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రైస్​ బౌల్​ ఆఫ్​ తెలంగాణే నిజమైన నివాళి: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.