పబ్‌లో తనపై జరిగిన దాడి ఘటనలో తనకు న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్‌ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కోరారు. ఈ మేరకు గొడవ దృశ్యాలను ట్విటర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. పబ్‌లో యువకులు తనను రెచ్చగొట్టి మరీ దాడి చేశారని... దృశ్యాలను చూశాక... ఏది సరైతే అది చెప్పాలన్నారు.
రెండు రోజుల క్రితం గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని ఓ పబ్‌లో రాహుల్ సిప్లింగంజ్‌పై కొంతమంది యువకులు దాడికి పాల్పడ్డారు. అతని తలపై బీరు బాటిల్‌తో కొట్టి... ముఖంపై పిడిగుద్దులతో దాడి చేశారు. ఈ ఘటనపై రాహుల్ సిప్లిగంజ్ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు రాజేశ్ అనే యువకుడితో పాటు.. మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి : అసెంబ్లీలో నమస్కారం 'కరో'నా అంటున్న నేతలు