Raghanandan Rao Cmplete Explanation On ITIR Project: ఎనిమిదేళ్లలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకూ మెట్రో కోసం 2 తట్టల మట్టి కూడా వేయలేదని.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. అసెంబ్లీలో వాగ్వాదం చేసుకుని.. ప్రగతి భవన్‌లో ఆలింగనాలు చేసుకోవడం ఎంఐఎంకు అలవాటేనని రఘనందన్ రావు దుయ్యబట్టారు. దుబ్బాకలోని పార్టీ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్, ఎంఐఎంపై మండిపడ్డారు.
ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందని.. ఐటీఐఆర్ అంటే ఒక భవనం కాదని తెలుకోవాలని రఘునందన్‌రావు హితవు పలికారు. 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని సూచించారని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడై ప్రాజెక్టు ఆలోచన చేశారన్న ఆయన.. అనంతరం బీజేపీ ప్రభుత్వం రెండు విడతల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని తెలిపారు.
సుమారు రూ.2లక్షల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొత్తాన్ని 20 ఏళ్లలో పూర్తి అభివృద్ధి చేయాలని నిర్ణయించారని వివరించారు. 2010లో హైదరాబాద్‌లో 202 చదరపు కిలోమీటర్లలో ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 4863కోట్లు ఇవ్వాలని కోరిందని తెలిపారు. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం రూ.3275కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎన్ని పనులు చేసిందో.. బహిరంగ చర్చకు సిద్దంగా లేకపోయినా.. కనీసం దీనిపై కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారని రఘునందన్ డిమాండ్ చేశారు.
"ఫేజ్-1లో ఫలక్‌నుమా నుంచి హుందానగర్ దాకా అక్కడి నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కొత్త రైల్వే లైన్ వేయాలని ప్రతిపాదించారని చెప్పారు. ఫలక్‌నుమా నుంచి శంషాబాద్ వరకు మెట్రో నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని.. ఇందుకు కేంద్రాన్ని 85కోట్లు అడిగారన్నారు. 2015లోనే ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు. ఇమ్యూనిమల్ బస్టాండ్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో అన్నారు వచ్చిందా.. గత బడ్జెట్‌లో ఈ మెట్రోకు రూ.500కోట్లు ప్రకటించారు. దీనికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అసెంబ్లీలో తిట్టుకుని ప్రగతిభవన్‌కు వెళ్లి ఆలింగనం చేసుకోవడం కొత్త కాదు ఎంఐఎం నాయకుడు ఒవైసీకి. కొత్తసిటీ అభివృద్ధి చెందినట్లు పాతబస్తీ అభివృద్ధి చెందడానికి ఒవైసీ అంత తాపత్రయపడితే.. కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదు." - రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే
ఇవీ చదవండి: