ETV Bharat / state

Radhika diamonds: రూ.7 కోట్ల వజ్రాభరణాల దొంగతనం కేసు చేధించిన పోలీసులు

Radhika diamonds gold theft case arrest police: హైదరాబాద్​లోని ఎస్సార్​నగర్​ పరిధిలో రాధిక డైమండ్స్‌ ఈ నెల 17వ తేదీన ఏడు కోట్ల విలువ చేసే ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్ వెల్లడించారు. నిందితుడి నుంచి మొత్తం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

రాధికా డైమండ్స్​ చోరీ సొత్తు స్వాధీనం
రాధికా డైమండ్స్​ చోరీ సొత్తు స్వాధీనం
author img

By

Published : Feb 25, 2023, 5:43 PM IST

Radhika diamonds gold theft case arrest police: ఇటీవల హైదరాబాద్​లో సంచలనం సృష్టించిన 7కోట్ల రూపాయాల విలువైన రాధిక డైమండ్స్​ బంగారు వజ్రాభరణాల చోరీ కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని అరెస్ట్​ చేశారు. రాధిక డైమండ్స్‌లో రెండు నెలల క్రితమే డ్రైవర్‌గా పనిలోకి చేరిన శ్రీనివాస్‌ విలాసవంతమైన జీవితం గడిపేందుకు విలువైన బంగారు ఆభరణాలను దొంగతనం చేయాలని కుట్రపన్నారని డీసీపీ జోయల్‌ డేవిస్​ పేర్కొన్నారు. మధురానగర్‌లో ఓ కస్టమర్‌కు ఇయర్ రింగ్స్‌ చూపించడానికి సేల్స్‌మెన్‌ అక్షయ్‌ కుమార్‌తో పాటు శ్రీనివాస్ వెళ్లారన్నారు.

అక్షయ్‌కుమార్ ఇయర్ రింగ్స్‌ డెలివరీ చూపించడానికి కస్టమర్ ఇంట్లోకి వెళ్లగానే డ్రైవర్ శ్రీనివాస్ అప్పటికే కారులో ఉన్న మిగతా ఏడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పారిపోయాడని వివరించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఆధారాలను పరిశీలించి అరెస్టు చేసినట్లు తెలిపారు.నిందితుణ్ని పట్టునేందుకు చాకచక్యంగా పని చేసిన పోలీసు సిబ్బందిని నగదు బహుమతి అందజేశారు.

"అక్షయ్​కుమార్​ రాధిక డైమండ్స్​లో సేల్స్​ ఎగ్జిక్యూటివ్​గా పనిచేస్తున్నారు. ఆయనతో పాటు కారు డ్రైవర్​ శ్రీనివాస్​ ఉన్నాడు. అక్షయ్​ ఇయర్​ రింగ్స్​ చూపడానికి కస్టమర్​ ఇంట్లోకి వేళ్లగానే కారు డ్రైవర్​ నగలతో ఉడాయించాడు. కంప్లయింట్​ రాగానే కేసు నమోదు చేశాం. హైదరాబాద్ కమీషనర్​ ఆఫ్​ పోలీస్​ సీవీ ఆనంద్​ ఆదేశాలమేరకు ఆరు జట్లుగా విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని వివిధ ప్రాంతాలలో సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పట్టుకున్నాం, నిందితుడి పూర్తి పేరు వెలిశెట్టి శ్రీనివాస్​ పోసి. అతడి స్వస్థలం కొవ్వూర్, ప్రస్తుతం మధురానగర్​ హాస్టల్​లో ఉంటున్నాడు. రాధిక డైమండ్స్​ కంపెనీల రెండు నెలల క్రితమే డ్రైవర్​గా పనిలోకి చేరాడు. నిందితుడి నుంచి 82 రకాల బంగారు వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నాం. -జోయల్ డేవిస్, పశ్చిమ మండలం డీసీపీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.