ETV Bharat / state

జాతి వివక్షపై కేటీఆర్‌కు ట్వీట్.. స్పందిస్తూ నిర్వాహకులపై చర్యలు - racism at star market vanasthalipuram

హైదరాబాద్‌ వనస్థలిపురంలో విదేశీయులను పోలి ఉన్న ఇద్దరు మణిపూర్‌ వాసులను స్టార్‌ మార్కెట్‌ నిర్వాహకులు అనుమతించకపోగా.. జాతి వివక్ష చూపిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. మంత్రి స్పందిస్తూ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరగా స్టోర్‌ మేనేజర్‌తో పాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

racism at star market vanasthalipuram
జాతి వివక్షపై కేటీఆర్‌కు ట్వీట్.. స్పందిస్తూ నిర్వాహకులపై చర్యలు
author img

By

Published : Apr 9, 2020, 3:37 PM IST

హైదరాబాద్‌ వనస్థలిపురంలోని స్టార్‌ మార్కెట్‌లో జాతి వివక్ష చూపించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. విదేశీయులను పోలి ఉన్న ఇద్దరు మణిపూర్‌ వాసులను నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. తమ ఆధార్‌కార్డు చూపించినా సెక్యూరిటీ గార్డు పట్టించుకోనందున జోనా అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు పోస్ట్‌ చేశారు.

  • Two of my friends were denied entry today to buy groceries at Starmarket Vanastalipuram,Hyderabad. Reason? They look like a foreginer and not an Indian.

    Even after producing their Aadhar Card, they were denied entry and were sent back home empty handed. (1/3) #SayNoToRacism pic.twitter.com/QsLC5F1Wd7

    — 𝙹𝚘𝚗𝚊𝚑 (जोनाह) (@jtrichao) April 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి..

జాతి వివక్ష చూపిన స్టార్‌ మార్కెట్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతూ కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. ఇలాంటి చర్యలు మున్ముందు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకునేలా కమిషనర్లు, ఎస్పీలకు సూచించాలని మంత్రి పేర్కొన్నారు.

  • This is absolutely ridiculous and unacceptable. Racism in any form should be dealt with sternly

    Request @TelanganaDGP Garu to instruct all Police Commissioners & Superintendents of Police to take up these issues seriously with retail association & send out a clear message https://t.co/A5WGxEyqbZ

    — KTR (@KTRTRS) April 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఇలాంటి ఘటనలను సహించేది లేదు'

స్టార్‌ మార్కెట్‌ వనస్థలిపురం స్టోర్‌ మేనేజర్‌తో పాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలను తామెవ్వరం సహించమని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎవరైనా వివక్ష చూపితే 9490617234కు ఫిర్యాదు చేయాలని సీపీ కోరారు.

ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.