రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేళల్లో లాక్ డౌన్ కచ్చితంగా అమలు చేస్తామని.. ప్రజలు పూర్తి సహకారం అందించాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కోరారు. ఉప్పల్, నాచారం, కూషాయిగూడ, పోలీసు స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్ట్‌ను ఆయన స్వయంగా పరిశీలించారు. రాకపోకలు సాగించిన వాహనాలను తనిఖీ చేపట్టారు.
వ్యాపార సముదాయాలు ఉదయం 10 గంటలకే మూసివేయాలని... లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల దుకాణాలకు ప్రజలు గుంపులుగా వెళ్లకూడదని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 9490617234 నెంబర్ కు ఫోన్ చేయాలని సీపీ కోరారు.
ఇదీ చూడండి: 'బ్లాక్ ఫంగస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'