ETV Bharat / state

శిక్షించడంలోనే కాదు... ఆదుకోవడంలోనూ మాకు మేమే సాటి - రాచకొండ పోలీస్ మహేశ్ భగవత్

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా... అన్ని వర్గాల వారిపై తన పంజా విసురుతోంది. చిన్నా, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా అందరినీ అల్లలాడిస్తోంది. ఈ వైరస్ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. సామాజిక స్పృహ కలిగిన వ్యక్తుల అండదండలతో కొనసాగే ఆశ్రమాలు... నేడు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ ఈ సంక్షోభ సమయంలో ముందుకు వచ్చి... వారిని ఆదుకునే దాతలెవరుంటారు? వారిని ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎవరు బయట పడేస్తారు?

rachakonda-police-commissioner-mahesh-bhagawath-helping-orphanages
శిక్షించడంలోనే కాదు... ఆదుకోవడంలోనూ మాకు మేమే సాటి
author img

By

Published : Apr 24, 2020, 6:53 PM IST

ఈ విపత్కర సమయంలోనే మీకు మేమున్నామంటూ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ముందుకొచ్చారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో నివసించే వారి ఆకలి తీర్చి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేస్తూ మేమున్నామని నిరూపిస్తున్నారు.

ఆశ్రమాలను దత్తత తీసుకుని

రాచకొండ పోలీస్ కమిషనరేట్​ తరఫున ఈ ఆశ్రమాలను దత్తత తీసుకుని వారికి చేయూత నిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎల్బీనగర్​ డీసీపీ సన్​ప్రీత్​ సింగ్, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తిని... ఆయా జోన్లలోని అనాథ, వృద్ధాశ్రమాల వివరాలను సేకరించాలని ఆదేశించారు. వారికి రేషన్, మందులు, భద్రతా పరికరాలు ఏవైతే అవసరాలున్నాయో వాటిని సైతం రూపొందించాలని సూచించారు. ప్రతి ఆశ్రమానికి ఉండే అవసరాలను అంచనా వేసి కార్యాలయానికి అందించాలని సూచించారు.

మొత్తం ఎంతమంది?

చైతన్యపురి, అబ్దుల్లాపూర్​మెట్​, బాలాపూర్​, ఎల్బీనగర్​, మీర్​పేట్​, వనస్థలిపురం, హయత్​నగర్​ తదితర ప్రాంతాల్లో ఆయా ఆశ్రమాల్లో అనాథలు, వృద్ధులు మొత్తం 1630 మంది ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు.

వారితో కలిసి...

రామకృష్ణ మఠం, జెన్​పాక్ట్​ వంటి సంస్థలు, పలువురు దాతల సాయంతో బియ్యం, నిత్యావసరాలు అందజేశారు. వైద్య సహాయం కావాల్సిన వారికి ఔషధాలు అందించారు. లాక్​డౌన్​ కొనసాగుతున్న సమయంలో అభాగ్యుల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలను మహేశ్​ భగవత్ అభినందించారు.

సలామ్ పోలీస్

మరింత మంది ముందుకు వచ్చి అన్నార్థులను ఆదుకోవాలని సూచిస్తున్నారు. నిరంతరం విధుల్లో ఉంటూ... తప్పు చేసిన వారి పట్ల కఠినంగా ఉండటమే కాదు... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ ముందుటామని పోలీసులు నిరూపిస్తున్నారు. లాక్​డౌన్​ సమయంలో దాతృత్వాన్ని చాటుతున్న రాచకొండ పోలీసుల తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఇవీ చూడండి: దశాబ్దాల కల నెరవేరింది: మంత్రి హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.