ఓయూలో జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థి సంఘ నాయకుడు సురేశ్ యాదవ్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పరామర్శించారు. నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న సురేశ్ యాదవ్‌పై దాడి చేయడాన్ని ఖండించారు. ఈ దాడి యావత్ నిరుద్యోగులపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దాడులను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తే... ప్రజలు కూడా తమ ఓటుతో దాడి చేసేందుకు సన్నద్ధం అవుతున్నారన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే... దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో పట్టిన గతే రానున్న ఎన్నికల్లో ఎదురవుతుందని కృష్ణయ్య హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'జనవరి తొలివారం నుంచి ఉచిత తాగునీటి సరఫరా'