కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ప్రభుత్వానికి అవసరమైన బీసీ కులాల లెక్కలు ఎందుకు తీయడం లేదని కృష్ణయ్య ప్రశ్నించారు. కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టకపోతే ఎన్యుమరేటర్లను గ్రామాల్లో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి: కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి: జేపీ