రాజస్థాన్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి కావాల్సిన రాళ్ల కోసం శర్మతురా డాంగ్ ప్రాంతంలోని గనులను సందర్శించారు. తెలుపు, ఎరుపు రాళ్ల కోసం అరడజను గనుల్లో తిరిగారు. హిరామాన్ డేడ్, వైట్, హిరాపురాలోని ఎర్ర గనులలో, మన్పురా మైనింగ్ ప్రాంతంలో రాళ్లను పరిశీలించారు.
కొత్త సచివాలయం నిర్మాణంలో ధౌల్‌పూర్ జిల్లాకు చెందిన ఎరుపు, తెలుపు రాయిని ఉపయోగిస్తామని తెలిపారు. ధౌల్‌పూర్ జిల్లాలో రాళ్ల నాణ్యత బాగుందని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా వాస్తు ప్రకారం సచివాలయం నిర్మిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం