ETV Bharat / state

నాసిరకం శిరస్త్రాణం పగిలింది... నాణ్యత కలిగినవే వాడండి - latest news of quality less helmets are blasted

హైదరాబాద్​లో నాసిరకం శిరస్త్రాణం​లను అమ్మితే చర్యలు తప్పవని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. నాసిరకం హెల్మెట్​ల వల్లే  ద్విచక్ర వాహనాల రోడ్డు ప్రమాదాలలో మృతుల సంఖ్య ఎక్కువైనదని పేర్కొన్నారు. గచ్చిబౌలీలో హెల్మెట్ల విక్రయదారులకు నకిలీ హెల్మెట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నాసిరకం శిరస్త్రాణం పగిలింది... నాణ్యత కలిగినవే వాడండి
author img

By

Published : Nov 25, 2019, 6:00 PM IST

హైదరాబాద్​లో నాసిరకం శిరస్త్రాణాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గచ్చిబౌలిలో నాణ్యత ప్రమాణాలులేని హెల్మెట్లపై సైబరాబాద్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్​కుమార్​తో పాటు బ్రాండెడ్ కంపెనీ హెల్మెట్ల తయారీ దారులు పాల్గొన్నారు. హెల్మెట్​ డీలర్లతో నాసిరకం హెల్మెట్లు విక్రయించమంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం హెల్మెట్ డీలర్స్ వారి వద్ద ఉన్న నాసిరకం హెల్మెట్లను రోడ్డుపై పగులగొట్టారు. సామాన్యులు నాసిరకం శిరస్త్రాణాలను ధరించి ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తింపు పొందిన హెల్మెట్లనే వాడాలని వాహనదారులను సీపీ కోరారు.

గత పది రోజులుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాసిరకం హెల్మెట్లు అమ్ముతున్న వారిపై 10 కేసులు నమోదు చేశామని... అలాంటి హెల్మెట్లు తయారు చేసిన, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సంవత్సరం సైబరాబాద్​లో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందని.. రోడ్డు ప్రమాదంలో 54 శాతం బైకు ప్రమాదాలే అని ఇందులో నాసిరకం హెల్మట్లు, చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వలన జరిగిన ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయన్నారు.

నాసిరకం శిరస్త్రాణం పగిలింది... నాణ్యత కలిగినవే వాడం

ఇదీ చూడండి: బంగారం ఎవరిది.. స్మగ్లర్లు ఎవరు?

Intro:Tg_Hyd_23_25_Helmet_Awareness_Cyb_Cp_Ab_Ts10002_HD
Note: Script FTP dwara Pampinchadam jarigindi

Body:Tg_Hyd_23_25_Helmet_Awareness_Cyb_Cp_Ab_Ts10002_HD

Conclusion:Tg_Hyd_23_25_Helmet_Awareness_Cyb_Cp_Ab_Ts10002_HD
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.