ETV Bharat / state

మాదాపూర్​ పోలీస్ స్టేషన్​ ఎదుట క్యూనెట్​ బాధితుల ధర్నా

క్యూనెట్​ కేసులో విచారణ వేగవంతం చేయాలని డిమాండ్​ చేస్తూ బాధితులు మాదాపూర్​ పోలీస్ స్టేషన్​ ఎదుట ఆందోళన చేపట్టారు. మల్టీ లెవల్​ మార్కెటింగ్​ పేరిట యువత, నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ఈ కేసులో 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Aug 4, 2019, 11:35 PM IST

మాదాపూర్​ పోలీస్టేషన్​ ఎదుట క్యూనెట్​ బాధితుల ధర్నా
మాదాపూర్​ పోలీస్టేషన్​ ఎదుట క్యూనెట్​ బాధితుల ధర్నా

క్యూనెట్ నిందితులను అరెస్ట్ చేయడంలో అలసత్వం వహిస్తున్నారంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. నిందితులను త్వరగా అదుపులోకి తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని బాధితులు నినాదాలు చేశారు. క్యూనెట్​ బారినపడిన యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ వేగవంతం చేయాలని డిమాండ్​ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

హైదరాబాద్​లోని మాదాపూర్​లో క్యూనెట్​ మల్టీ లెవెల్​ మార్కెటింగ్​ పేరిట భారీ కుంభకోణం జరిగింది. క్యూనెట్​ సంస్థలో డబ్బులు జమచేస్తే రెండితల ఆదాయం వస్తుందని నిరుద్యోగులు, యువతను నమ్మించి భారీగా వసూళ్లకు పాల్పడింది. రాచకొండ, సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చూడండి: శ్రమజీవుల బతుకులను చిదిమేసిన రోడ్డు ప్రమాదం

TG_WGL_67_04_BARREJI GATES OPEN REVISED_AV_G3 రిపోర్టర్ : టి.శశాంక్ సెంటర్ : మహాదేవపూర్ జిల్లా : భూపాలపల్లి సెల్ నంబర్ : 9676766098, 800855788 * మేడిగడ్డ బ్యారేజిలో 81 గేట్లు ఎత్తివేత. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుడడంతో తెలంగాణ, మహారాష్ట్ర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. మహారాష్ట్రలోని టేకడ, మహాగావ్ నుంచి వరద భారీగా వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు, పంపుహౌసల వద్ద జలశయాలు నిండుకుంటున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారెజిలో మొదటిసారిగా భారీగా గేట్లను ఎత్తారు. ఆదివారం రాత్రి భారీ వరద ప్రవాహం వస్తుండడంతో 9.00 గంటల ప్రాంతంలో గేట్లు తెరిచారు. బ్యారేజి లో 85 గేట్లకు గాను 81 గేట్లను ఎత్తుడంతో భారీగా నీరు దిగువకు చేరుతుంది. కొన్ని గేట్లను ఆరు మీటర్లు, మరికొన్ని నాలుగు, రెండు మీటర్ల మేర ఎత్తి ఉంచారు. ఇన్ ఫ్లో 8.26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండడంతో అవుట్ ఫ్లో 8.26 లక్షల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రి అన్నారం బ్యారేజిలో 4గేట్లు ఎత్తివేతారు. ఇన్ ఫ్లో 6600 క్యూసెక్కుల వరద నీరు వస్తూండడంతో అవుట్ ఫ్లో 18000 క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంతో జలాశయం పూర్తి స్థాయికి చేరుకుంది. కన్నెపల్లి పంపుహౌజ పంపులు నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 5.98, అన్నారం బ్యారేజీ వద్ద 7.7 కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద 8.0 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.