పీవీ శతజయంతి ఉత్సవాలు (PV Narasimha Rao Centenary Celebrations) నేటితో ముగియనున్న నేపథ్యంలో... పీవీ మార్గ్(PV Marg)లోని జ్ఞానభూమిలో ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సై(Governor Tamilisai), ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హాజరై... 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీవీ కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు(PV Narasimha Rao) శత జయంతి ముగింపు ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. తొలుత నెక్లస్‌రోడ్డులో పీవీ మార్గ్(PV Marg)ను ప్రారంభించిన గవర్నర్(Governor)... అనంతరం సీఎం కేసీఆర్(CM KCR)తో కలిసి నెక్లెస్‌రోడ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని(PV bronze Statue) ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పీవీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
కాంస్య విగ్రహం ఆవిష్కరణ అనంతరం పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో జరిగిన ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా పలువురు నేతలు, పీవీ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. పీవీ ఘనతపై రూపొందించిన 9 పుస్తకాలను గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ విడుదల చేశారు. పీవీ ఆర్థిక సంస్కరణలు, పాలనారీతులు, చరిత్రపై ఈ 9 పుస్తకాలు రచించారు. విద్యా మంత్రిగా పీవీ చేసిన సంస్కరణలను సీఎం కేసీఆర్ కొనియాడారు.
పీవీ గొప్ప ఆదర్శవాది
పీవీ తెచ్చిన భూసంస్కరణలపైనా కూడా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఆయన గొప్ప ఆదర్శవాది అని ప్రశంసించారు. రాజకీయ సంస్కరణలతో దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని పీవీని స్మరించుకున్నారు. కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన సీఎం... భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలకు పీవీ పేరు పెడతామని వెల్లడించారు. పీవీని ఎంత గౌరవించుకున్నా తక్కువేనన్నారు. ఏడాది కాలంగా పీవీ జయంత్యుత్సవాలు జరుపుకుంటున్నామని... వాటిని విజయవంతంగా నిర్వహించిన కేశవరావుకు అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి: CM KCR : కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం
బహుముఖ ప్రజ్ఞాశాలి
పీవీ శతజయంతి అందరికీ గొప్ప పండుగ అని గవర్నర్ పేర్కొన్నారు. పేదల పెన్నిధి, బహుముఖ ప్రజ్ఞాశాలి... పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగం కావడం గర్వంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీవీకి అర్పించిన ఘన నివాళి... తరతరాలకు గుర్తుండిపోతుందన్నారు.
ఇదీ చూడండి: Tamilisai: 'పీవీ జయంత్యుత్సవాలతో తెలంగాణ తల్లి సంతోషిస్తోంది'
ఏడాదిపాటు రాష్ట్రంతోపాటు ఇతర దేశాల్లో శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వంతో పాటు వివిధ సంస్ధలు ఘనంగా నిర్వహించాయి. పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ఉత్సవాలను ఘనంగా ముగించారు.
ఇదీ చూడండి: నెక్లెస్ రోడ్‌లో 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ