PV Narasimha Rao 19th Death Anniversary in Hyderabad : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి వేళ హైదరాబాద్‌లోని 'పీవీ జ్ఞానభూమి' వద్ద గవర్నర్ తమిళిసై నివాళులు(Tamil Say Tributes to PV) అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, పీవీ కుటుంబ సభ్యులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేతలు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పీవీ చేసిన సంస్కరణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు.
CM Pays Tributes to PV Death Anniversary : పీవీ నరసింహారావును గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి అని కీర్తించారు. పరిపాలనలో మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారన్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పేదలకు భూములు పంచడానికి బలమైన పునాదులు వేశారని తెలిపారు. ఆయన మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు.
పీవీ ఘాట్(PV Ghat Development in Hyderabad), జైపాల్ రెడ్డి ఘాట్లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. వీరిద్ధరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి కీర్తిని పెంచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
" class="align-text-top noRightClick twitterSection" data=""దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు. పరిపాలనలో మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. పేదలకు భూములు పంచడానికి బలమైన పునాదులు వేశారు. పీవీ కీర్తిని పెంచేలా ప్రభుత్వం పని చేస్తుంది."- రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
ఆయన వ్యక్తిత్వం నిరాడంబరం
— Revanth Reddy (@revanth_anumula) December 23, 2023
ఆయన మేథస్సు శిఖరాగ్రం
ఆయన చాణక్యం అసమానం
మన కీర్తి పతాక… తెలంగాణ మట్టి బిడ్డ
మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. pic.twitter.com/ZUVKPxWJ6x
">ఆయన వ్యక్తిత్వం నిరాడంబరం
— Revanth Reddy (@revanth_anumula) December 23, 2023
ఆయన మేథస్సు శిఖరాగ్రం
ఆయన చాణక్యం అసమానం
మన కీర్తి పతాక… తెలంగాణ మట్టి బిడ్డ
మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. pic.twitter.com/ZUVKPxWJ6x
ఆయన వ్యక్తిత్వం నిరాడంబరం
— Revanth Reddy (@revanth_anumula) December 23, 2023
ఆయన మేథస్సు శిఖరాగ్రం
ఆయన చాణక్యం అసమానం
మన కీర్తి పతాక… తెలంగాణ మట్టి బిడ్డ
మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. pic.twitter.com/ZUVKPxWJ6x