దేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడు...పరిపాలనా దక్షత కలిగిన వ్యక్తి మాజీ ప్రధాని పివీ నరసింహారావు అని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కీర్తించారు. స్థితప్రజ్ఞ, బహుభాషా కోవిదుడు అని కోనియాడారు. శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 98వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోశయ్య పలువురు సామాజికవేత్తలకు పీవి జ్ఞాన పురస్కారాలను అందజేశారు. చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి : 'ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారమే లక్ష్యం'