ETV Bharat / state

భయాలు పటాపంచలు.. ఇద్దరు అనుమానితుల్లో వైరస్​ లేదు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పుణెకు పంపిన ఇద్దరు అనుమానితుల నమూనాల్లో వైరస్​ లేదని అక్కడి ప్రయోగశాల ధ్రువీకరించింది. ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, అపోలో ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలిలో వైరస్‌ లేదని నిర్ధరణ కావడం వల్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంది.

భయాలు పటాపంచలు.. ఇద్దరు అనుమానితుల్లో వైరస్​ లేదు
భయాలు పటాపంచలు.. ఇద్దరు అనుమానితుల్లో వైరస్​ లేదు
author img

By

Published : Mar 6, 2020, 7:07 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిపై గత నాలుగు రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. పుణెకు పంపిన ఇద్దరు అనుమానితుల నమూనాల్లో వైరస్‌ లేదని అక్కడి ప్రయోగశాల ధ్రువీకరించింది. ఫలితాలను గురువారం సాయంత్రం ప్రభుత్వానికి పంపింది. ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ (యువతి), అపోలో ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలిలో వైరస్‌ లేదని నిర్ధరణ కావడం వల్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంది. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడి ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు చెప్పారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడినా 14 రోజుల అనంతరమే ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తామని తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నాటికి రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదు కాగా, మరో 45 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది.

భయాలు పటాపంచలు:

ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, అపోలో పారిశుద్ధ్య కార్మికురాలికి గాంధీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో స్పష్టత కొరవడడంతో ఇద్దరి నమూనాలను మంగళవారం పుణెకు పంపించారు. ఇదే సమయంలో వీరిద్దరికీ వైరస్‌ సోకినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇటలీ నుంచి వచ్చిన మహిళ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తుండగా.. హైటెక్‌ సిటీ ఏరియా మొత్తం ఉలిక్కిపడింది. అనేక మంది ఉద్యోగులు ఉన్నఫలానా ఇంటి బాటపట్టారు. దీంతో ప్రభుత్వం అత్యవసరంగా రంగంలోకి దిగింది. వైరస్‌ వ్యాప్తిపై అవగాహన కల్పించే దిశగా సమావేశాలు నిర్వహించింది. ఈ పరిస్థితుల్లో ఫలితం వెల్లడిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గురువారం సాయంత్రం కరోనా లేదని తేలగానే.. స్వయంగా మంత్రి ఈటల విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించారు. అలానే హైదరాబాద్‌లో కరోనా బాధితుడి కుటుంబం నివసించే ప్రదేశంలో ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్లు తమకు వైరస్‌ సోకుతుందేమోననే ఆందోళనతో ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇప్పటికే బాధితుడి సొంత ఇంట్లో కుటుంబ సభ్యులెవరికీ, బాధితుడు చికిత్స పొందిన అపోలో ఆసుపత్రిలో 45 మందిలో 44 మందికి కరోనా సోకలేదని నిర్ధారణ అయింది. వీరిలో ఒక్క పారిశుద్ధ్య కార్మికురాలి పరీక్షల్లో మాత్రం స్పష్టత కొరవడడంతో.. వైరస్‌ వ్యాప్తి పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడంలో ఆరోగ్యశాఖకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆమెకు కూడా వైరస్‌ లేదని నిర్ధారణ కావడంతో.. అపోహలను నమ్మొద్దని బలంగా చెప్పడానికి మార్గం సుగమమైంది.

కమిటీలతో నిత్యం సమావేశం:

రాష్ట్ర స్థాయిలో కరోనాపై నిరంతర పర్యవేక్షణకు ఏర్పాటుచేసిన 6 కమిటీలు ఇక నుంచి రోజూ సమావేశమవుతాయి.

* రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీలో వైద్య మంత్రి నేతృత్వంలో ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ సభ్యులుగా ఉన్నారు.

* ఆసుపత్రి నిర్వహణ కమిటీకి హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌..

* కేసుల గుర్తింపు కమిటీకి జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌..

* ప్రచార కమిటీకి జాతీయ ఆరోగ్య మిషన్‌ ముఖ్య సమాచార అధికారి..

* ఔషధాలు, పరికరాల నిల్వ కమిటీకి టీసాక్స్‌ ఎండీ..

* శిక్షణ, సామర్థ్య కమిటీకి ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ సంచాలకులు నేతృత్వం వహిస్తున్నారు. గురువారం నాటి సమావేశంలో ఛాతీ ఆసుపత్రిలో ప్రత్యేక పడకల ఏర్పాటు, మాస్కుల నిల్వ తదితర అంశాలపై చర్చించారు. అన్ని జిల్లాల, బోధనాసుపత్రుల అధికారులతో, అన్ని ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ సేవలను ఆన్‌లైన్‌లో చూసే విధానాన్ని కూడా గురువారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు.

200 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ:

కరోనా అనుమానితులు, బాధితులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను గుర్తించడంపై ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. వీరిని గుర్తించేందుకు సుమారు 200 మంది సిబ్బందికి గురువారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేయడానికి వీరు ముందుకొచ్చారని మంత్రి వీరిని అభినందించారు. కరోనాపై దిల్లీలో ప్రత్యేక శిక్షణకు ఆరుగురు వైద్యసిబ్బందిని పంపించారు.

జర్మనీ వెళ్లొచ్చి ఆసుపత్రిలో చేరిన జంట:

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా కేంద్రం పరిసర మండలానికి చెందిన దంపతులు తీవ్రమైన జలుబుతో చికిత్స నిమిత్తం గురువారం రాత్రి ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే జర్మనీ వెళ్లొచ్చిన వీరిద్దరు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రచారం నేపథ్యంలో దంపతులను ప్రత్యేక వార్డులో ఉంచి సేవలందిస్తున్నారు. హైదరాబాద్‌ గాంధీలో పరీక్షల అనంతరం వైరస్‌ ప్రభావం ఉందా లేదా అనేది తేలుతుందని వైద్యులు వెల్లడించారు.

‘గాంధీ’కి 35 మంది అనుమానితుల రాక..

కరోనా లక్షణాలతో పరీక్షల కోసం గురువారం గాంధీలో 35 మంది చేరారు. ఇందులో కరోనా బాధితుడితో సన్నిహితంగా మెలిగినవారితో పాటు ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరిలో 33 మంది నుంచి శాంపిళ్లు తీసుకొని పరీక్షలకు పంపామని అధికారులు తెలిపారు. జలుబు, జ్వరం, దగ్గు ఎక్కువగా ఉన్నవారిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ కరోనాపై అధ్యయనానికి కేరళ వెళ్లడంతో ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ రాజారావుకు ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు గాంధీకి 169 మంది అనుమానితులు వచ్చారు. ఇందులో 135 మందిలో వైరస్‌ లేదని తేలింది. మిగతావారి ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా అనుమానంతో వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు గురువారం నల్లకుంట ఫీవరాసుపత్రిలో చేరారు. వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.

ఇవీ చూడండి: ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.