'తక్కువ సమయంలోనే 80లక్షల మందికి టీకా అందిస్తాం' - తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీ
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కరోనా టీకా...ఇప్పటికే కొన్నిదేశాల్లో అందుబాటులోకి రాగా...మనదేశంలోనూ వ్యాక్సిన్ సరఫరా అతి త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే వ్యాక్సిన్ తొలుత ఎవరికి ఇవ్వాలి..? ఎంతమందికి ఇవ్వాలి...? ఎలా సరఫరా చేయాలి వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిస్తోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో కొవిడ్ టీకా పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో జిల్లాల్లోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి టీకా పంపిణీకి సంబంధించిన శిక్షణా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోంది. 10 వేల మంది వ్యాక్సినేటర్ల ద్వారా అతి తక్కువ సమయంలోనే దాదాపు 80 లక్షల మందికి టీకా అందిస్తామంటున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..