హైదరాబాద్లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. శామీర్పేట్ నల్సార్ యూనివర్సిటీ సమీపంలో రహదారిపై కార్లు, ద్విచక్రవాహనదారులపై రాళ్లతో దాడి చేశాడు. అకస్మాత్తుగా జరిగిన దాడితో వాహనదారులు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు సైకోను పట్టుకుని శామీర్పేట్ పోలీసులకు అప్పగించారు.