మైనర్ బాలికపై కత్తితో దాడి హైదరాబాద్ బర్కత్‌పురా సమీపంలోని సత్యానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను అంగీకరించలేదని మైనర్‌ను చంపేందుకు యత్నించాడు.
కొబ్బరి బోండాలకు ఉపయోగించే కత్తితో దాడికి తెగబడ్డాడు. తీవ్రగాయాలైన అమ్మాయిని మలక్‌పేట ప్రైవేటు అసుపత్రికి తరలించారు. బర్కత్‌పురా పరిధిలోని సత్యానగర్‌లో రాములు కూతురు మధులిక ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అదే కాలనీలో ఉంటున్న భరత్ కొన్ని రోజుల నుంచి ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. బుద్ధి మార్చుకోమని భరత్‌కు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మారలేదు. రెండు రోజుల ముందు బాధితురాలి తల్లికి ఫోన్ చేసి బెదిరించాడు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో చంపేందుకు ప్రయత్నించాడు. కొబ్బరికాయలు నరికే కత్తితో అతి దారుణంగా పొడిచాడు. బాధితురాలి మెడ, పొట్ట, చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.