గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్స్ జేఏసీ ధర్నా చేపట్టింది.
దీక్షా శిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావు తదితరులు సందర్శించారు. కార్మికుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం కనీస వేతనం రూ. 21,000 ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్లు తమ పోరాటాన్ని కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సూచించారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎన్ని కుట్రలు చేసినా తాము అండగా నిలిచి పోరాటానికి మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి : 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం