గిరిజనుల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రకటించారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున అబద్దాలు చెప్పే సీఎం ఎవరు లేరని ఆయన ఆరోపించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నుంచే సీఎం కేసీఆర్ అబద్ధాలు ప్రారంభమయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. ఆ దీక్షా కార్యక్రమానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర అన్ని పార్టీల నేతలు, అన్ని కుల సంఘాలు పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి : ఆశ పెడతారు.. నిట్టనిలువునా ముంచేస్తారు...