తెలుగు భాషకు ప్రమాదమేర్పడుతుందని.... మన మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని తెలుగు భాషా కూటమి అభిప్రాయపడింది. హైదరాబాద్లోని దోమలగూడ ఇందిరాపార్క్ వద్ద గల హైదరాబాద్ స్టడీ సర్కిల్లో తెలుగు భాషా కూటమి సమావేశం ఏర్పాటు చేసి... భాషోద్యమానికి తీసుకోవాల్సిన కార్యచరణపై చర్చించారు.
భాషను కాపాడుకోకపోతే... భాషతో పాటు మన సంస్కృతి, కళలు, చరిత్ర, విజ్ఞానం, జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని సమావేశంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. భాషాభిమానం ఉన్నవారు మాటలకే పరిమితం కాకుండా... చేతలు చూపించాలని కోరారు. పిల్లలు మాతృభాషను మర్చిపోకుండా చూసే బాధ్యత వారి తల్లిదండ్రుల పైనే ఉందన్నారు. ఇతర భాషలు నేర్చుకున్నా... మాతృభాషను మర్చిపోవద్దని సూచించారు.
ఇవీ చూడండి: కొత్త జీహెచ్ఎంసీ చట్టంపై మంత్రి కేటీఆర్ సమీక్ష