వెల్‌నెస్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళతోపాటు ఇద్దరు విటులను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన టి. శైలజ, టి. పరమేశ్వరరావు భార్యాభర్తలు.. నగరంలోని వెంకటగిరి ప్రాంతంలో అవని వెల్‌నెస్ సెంటర్ నెలకొల్పారు.
ఈ కేంద్రంలో రహస్యంగా అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఓ వెబ్‌సైట్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. గురువారం పోలీసులు గృహంపై దాడులు నిర్వహించారు. నిర్వాహకురాలు శైలజతోపాటు విటులు అలీ, రాజురెడ్డిలను అరెస్టు చేశారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. పరమేశ్వరరావు పరారీలో ఉన్నాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం