హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని లాయర్లు డిమాండ్ చేశారు. ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. హత్యకు నిరసనగా సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఎదుట న్యాయవాదులు రెండో రోజు ఆందోళనకు దిగారు.
ఏలా రక్షణ కల్పిస్తారు?..
రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు సామాన్యులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని తెలంగాణ పోలీసులను ప్రశ్నించారు. న్యాయవాదులను కాపాడడంలో, నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
తమకే ఇలాంటి పరిస్థితా?..
దేవాలయ భూముల విషయంలో నిజాయితీగా కేసు వాదిస్తున్న వారి విషయంలో ఇలాంటి దారుణం జరగడం బాధాకరమన్నారు. న్యాయవాది కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నిరసనలో పోలీసులకు, న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదున్నారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టును బహిష్కరించి ధర్నా చేపట్టారు.
ఇదీ చూడండి: న్యాయవాదుల నిరసనలో ఉద్రిక్తత.. లాయర్‌పై వ్యక్తి దాడి