వృద్ధులు, వికలాంగుల సంక్షేమంపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సచివాలయంలో సమీక్షించారు. ప్రతి జిల్లాలో ఒక వృద్ధ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వృద్ధుల సమగ్ర కార్యక్రమ రూపకల్పనకు కోసం ప్రభుత్వేతర సంస్థలు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఉన్న వృద్ధాశ్రమాల్లో వసతి, వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని సూచించారు.
డే కేర్ సెంటర్లు
పట్టణప్రాంతాల్లో డే కేర్ సెంటర్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. వికలాంగుల కోసం నిర్వహిస్తున్న వసతిగృహాల్లో సదుపాయాలు మెరుగుపరచాలన్నారు. వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. ఎన్టీఆర్ మార్గ్‌లో తలపెట్టిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ పనులను వేగవంతం చేయాలని నిర్దేశించారు.
ఇవీ చూడండి: విక్రమ్ వాసుదేవ్.. అవినీతి పోలీస్ అధికారి