ETV Bharat / state

'విద్యార్థుల ఆత్మహత్యలు వదిలేసి కేరళలో కేసీఆర్​' - INTER DHARNA

"ముఖ్యమంత్రి విద్యార్థుల ఆత్మహత్యలు, భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా పర్యటనలు చేస్తున్నారు. విద్యార్థలకు అండగా మేమున్నాం. మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు": ఆచార్య హరగోపాల్, మానవ హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి

'ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మీకు అండగా మేమున్నాం'
author img

By

Published : May 7, 2019, 1:37 PM IST

రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని పట్టించుకోకుండా కేరళ పర్యటనలో ఉన్నారని మానవ హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తన తీరుని మార్చుకోవాలని సూచించారు. గ్లోబరీనా సంస్థకు ఎటువంటి అర్హతలు లేకుండా పది లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్​లో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

'ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మీకు అండగా మేమున్నాం'

ఇవీ చూడండి: పట్టపగలే హైదరాబాద్​లో 70 లక్షల చోరీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.