Producer Anji Reddy Murder Case : హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాత, స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి దారుణ హత్య(Realtor Anji Reddy brutally murder) కలకలం రేపింది. అంజిరెడ్డిని హత్య చేసి రహదారి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ గోపాలపురం పోలీసులు ఎట్టకేలకు అంజిరెడ్డి హత్య కేసు(Murder Case) చేధించారు. అంజిరెడ్డిని కాట్రగడ్డ రవి అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై నిందితుడు కాట్రగడ్డ రవిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Realtor Anji Reddy Murder Case Hyderabad : స్థిరాస్తి వ్యాపారి, నిర్మాత అయిన అంజిరెడ్డి ఆస్తులను కాజేసేందుకే పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇద్దరు బిహారీ వ్యక్తులతో కలిసి రవి అనే వ్యక్తి ఈ హత్య చేయించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అంజిరెడ్డి పేరు మీద ఉన్న భవనాలు ఆస్తులను దక్కించుకోవాలని ఆయనను అంతమొందించేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.
Hyderabad Man Kills Daughter : భవిష్యత్‌లో కష్టాలొస్తాయని.. కూతుర్ని చంపేశాడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 29వ తేదీన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వాణిజ్య సముదాయంలోని సెల్లార్లో అంజిరెడ్డిని మృతి చెంది కనిపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బీహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులకు రవి కాట్రగడ్డ సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా అంజిరెడ్డి హత్యను రహదారి ప్రమాదంగా చిత్రీకరించారు. గోపాలపురం పోలీసులు రహదారి ప్రమాదాన్ని లోతుగా పరిశీలించగా.. హత్య కోణం బయటపడింది.
Twist in Producer Anji Reddy Murder Case : అంజిరెడ్డి తన ఆస్తులను అమ్మి అమెరికా వెళ్లాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆస్తులను అమ్మే పనిని కాట్రగడ్డ రవికి అప్పజెప్పాడు. ఇదే అదునుగా భావించిన రవి ఎలాగైనా ఆస్తులను తన సొంతం చేసుకోవాలని ఉద్దేశంతో తన పేరిట ఆస్తులను రాయించుకుని అంజిరెడ్డి హత్యకు కుట్ర పన్నాడు. పథకం ప్రకారం ఇద్దరు బిహారీలకు సుపారీ ఇచ్చి స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డిని ఓ వాణిజ్య సముదాయం సెల్లార్లో హత్యచేశాడు. అనంతరం గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహాన్ని పడేశాడు. పోలీసులకు, కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించారు. అది కాస్త పోలీసులు విచారణలో తేటతెల్లం అయింది. ఎట్టకేలకు గోపాలపురం పోలీసులు హత్య కేసును చేధించిన.. నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.