పోలీస్ ఉద్యోగంలో ఉన్నంత సంతృప్తి మిగతా ఉద్యోగాల్లో ఉండదని.. వృత్తిని ప్రేమించినప్పుడే అందులో ఉండే సంతోషాన్ని పొందగలమని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలలో హైదరాబాద్ కమిషనరేట్‌కు 203 మందిని కేటాయించారు. ప్రొబేషనరీ ఎస్సైలతో హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ సమావేశమయ్యారు.

దేశంలో తొలసారి ఎక్కువ సంఖ్యలో మహిళా ఎస్సైలు ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్నారని.. మహిళలు పోలీస్‌శాఖలోకి రావడానికి ఆసక్తి చూపించడం మంచి పరిణామమని అంజనీకుమార్ అన్నారు. సమాజంలో శాంతి భద్రతల కోసం.. కొన్నిసార్లు పోలీసులు వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టాల్సి వస్తుందని.. ఇలాంటి అవకాశం అందరికీ రాదని సీపీ అన్నారు. ప్రొబేషనరీ ఎస్సైలను విధుల్లోకి ఆహ్వానించారు.