ETV Bharat / state

CORONA: థర్డ్​వేవ్​ భయం.... కొలువుకి వెళ్లాలా? వద్దా? అన్న సందిగ్ధం!! - పాఠశాలకు వెళ్లేందుకు వెనకాడుతున్న ప్రైవేటు టీచర్లు

కరోనా కారణంగా ప్రైవేట్‌ పాఠశాలలు మూతబడటంతో చేతికి దొరికిన పని చేస్తూ పొట్ట పోసుకుంటున్న ఉపాధ్యాయుల ఇప్పుడు కొలువుల్లో చేరాలా? లేదా?అని అయోమయంలో పడ్డారు. ఒకవేళ ఉద్యోగాల్లో చేరిన తర్వాత మూడో వేవ్‌ వస్తే మళ్లీ రోడ్డున పడాల్సి వస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది. మరోవైపు వందల పాఠశాలలు అతి తక్కువ వేతనంతో కొత్త వారిని నియమించుకుంటున్నాయి.

schools
schools
author img

By

Published : Sep 8, 2021, 7:51 AM IST

రాష్ట్రంలో ప్రైవేట్‌ బడులు తెరుచుకున్నా ప్రత్యక్ష తరగతులకు నాలుగో వంతు మంది కూడా హాజరుకావడం లేదు. మొత్తం 10,800 ప్రైవేట్‌ పాఠశాలలుండగా ఇంకా 1,200 వరకు పునఃప్రారంభం కాలేదని విద్యాశాఖ చెబుతోంది. వాస్తవంగా తెరుచుకోని బడులు రెట్టింపు ఉండొచ్చని ప్రైవేటు యాజమాన్యాల అంచనా. తెరిచినా చాలా చోట్ల ఆరు, ఆపై తరగతులే నడుస్తున్నాయి. ప్రాథమిక తరగతులున్న చోట్ల అతి తక్కువ మంది విద్యార్థులొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యాజమాన్యాలు సైతం పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించుకోవడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ప్రైవేట్‌ ఉపాధ్యాయలుగా పనిచేస్తుండగా అందులో కనీసం నాలుగో వంతు మంది బోధనా వృత్తికి దూరమవుతారని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఫీజులివ్వడం లేదంటున్న యాజమాన్యాలు

తల్లిదండ్రులు కూడా కరోనా మూడో వేవ్‌ వస్తే మళ్లీ బడుల్ని మూస్తారని భావిస్తున్నారు. అందువల్ల ఫీజులు కట్టేందుకు వెనకాముందు ఆడుతున్నారని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తామెలా వేతనం చెల్లించాలని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.‘ చిన్న పాఠశాలలకు ఇబ్బంది పరిస్థితి ఉన్న మాట వాస్తవమే’ అని ట్రస్మా కోశాధికారి శేఖర్‌రెడ్డి తెలిపారు. అందుకే రవాణా తదితర పన్నులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు.

పెద్దగా ఆర్థిక ప్రయోజనం లేదు

రెండు రాష్ట్రాల్లో పలు బ్రాంచీలున్న ఓ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేశా. పదిహేడేళ్ల అనుభమున్న నాకు గతంలో నెలకు రూ.12 వేలు ఇచ్చేవారు. పిల్లలందరూ వచ్చేవరకు ఇప్పుడు రూ.5 వేలు ఇస్తామంటున్నారు. ఫోన్లు చేసి మేమే పిల్లల్ని బడులకు పంపాలని కోరాలి. తల్లిదండ్రులను ఫీజులు అడగాలి. కరోనా మూడో వేవ్‌ వస్తే మళ్లీ తీసేస్తారు. ఇప్పుడు నేను చుట్టుపక్కల ఇళ్లలో హోం ట్యూషన్లు చెబుతుండటంతో రూ.5 వేలు వస్తున్నాయి. మళ్లీ కొలువులో చేరినా పెద్దగా ఆర్థిక ప్రయోజనం లేదని పించింది. -జ్యోతి, ఆంగ్లం ఉపాధ్యాయురాలు, బడంగ్‌పేట

పాత వేతనం ఇస్తారో?లేదో? సందేహంతోనే...

హైదరాబాద్‌ మూసాపేటలోని ఓ పాఠశాలలో హిందీ సబ్జెక్టు బోధించేవాణ్ని. నెలకు రూ.16 వేల వేతనం ఇచ్చేవారు. బడుల మూతతో కూకట్‌పల్లిలోని ఓ కంపెనీ స్టోర్‌లో పనిచేస్తున్నా. నెల జీతం రూ.13 వేలు. మళ్లీ కొలువులో చేరమని పాఠశాల నుంచి ఫోన్‌ వచ్చింది. నేను ఏ నిర్ణయం చెప్పలేదు. - కల్యాణ్‌కుమార్‌, కూకట్‌పల్లి, హైదరాబాద్‌

మళ్లీ చేరమని అడగలేదు

నేను ఎంఏ, బీఈడీ చేసి వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని ఓ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడిని. కరోనాతో పాఠశాల మూతపడింది. ఆగస్టు నెలంతా ఆన్‌లైన్‌ తరగతులు చెప్పా. అయినా వేతనం ఇవ్వలేదు. ఇప్పుడు నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్నా. వాట్సప్‌ గ్రూపులో పాఠశాలను తెరిచామని మెసేజ్‌ పెట్టారు. గతంలో ఈ పాఠశాలలో 500 మంది వరకు ఉండగా ఇప్పుడు 100 మంది లోపు విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు వస్తున్నారు. నన్ను రమ్మని చెప్పలేదు. ఇక నమ్మకం లేక వెళ్లలేదు.

- దామోర సూర్య చంద్ర, గీసుకొండ మండలం, వరంగల్‌ జిల్లా

ఇదీ చూడండి: తల్లిదండ్రుల అనుమతి పత్రం ఉంటేనే క్లాస్​లోకి ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.