ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన హోటల్ వ్యాపారి ఒకరు ఇటీవల కరోనాతో చనిపోయారు. అంతకు ముందు ఆయన కొత్తపేటలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి యాజమాన్యం ప్రాథమిక వైద్యపరీక్షల తర్వాత అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని డిశ్ఛార్జ్ చేసింది. అయితే సదరు వ్యక్తికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు, గుంటూరు అర్బన్ పోలీసులకు తెలియజేయలేదు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు పంపించలేదు. ఆ వైద్యులు, సిబ్బందితో ఇతర రోగులకు వైద్యసేవలు కొనసాగించటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు.
ఈ ఘటన పై గుంటూరు అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ మాట్లాడుతూ ‘లాక్‌డౌన్ అమలవుతున్నప్పుడు ఆసుపత్రి తీయకూడదు. కానీ సదరు వ్యక్తికి వైద్యపరీక్షలు చేసినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు సేకరించారు. వెంటనే ఆసుపత్రిలోనే వైద్యులు, ఇతర సిబ్బందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపాం. వారిని ఆస్పత్రి యాజమాన్యమే క్వారంటైన్‌కు పంపి, వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుని ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ వారు ఆ పని చేయలేదు. చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చి బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు యాజమాన్యం, వైద్యులపై కేసులు పెట్టాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.
ఇవీ చదవండి...పిడికిలెత్తే చేతులు.. పిడికెడన్నానికి చాస్తూ..