ETV Bharat / state

రాష్ట్రంలో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన - Modi telangana tour latest updates

MODI HYDERABAD TOUR: రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. బేగంపేట విమానాశ్రయం వద్ద గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, మంత్రి తలసాని, భాజపా నేతలు మోదీకి వీడ్కోలు పలికారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మోదీ విజయవాడకు వెళ్లారు.

రాష్ట్రంలో ముగిసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన

author img

By

Published : Jul 4, 2022, 10:10 AM IST

MODI HYDERABAD TOUR: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. ఆదివారం పరేడ్ మైదానంలో విజయ సంకల్ప సభ అనంతరం రాజ్​భవన్​లో రాత్రి బస చేసిన ప్రధాని.. ఉదయం రాజ్​భవన్​ నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. 9.25 గంటలకు బేగంపేట ఎయిర్​పోర్టు నుంచి విజయవాడకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ గన్నవరం విమానాశ్రయంలో​ ప్రధానికి స్వాగతం పలకనున్నారు.

అంతకుముందు గవర్నర్​ తమిళి సై, ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, పలువురు భాజపా నేతలు ప్రధాని మోదీకి వీడ్కోలు పలికారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బేగంపేట విమానాశ్రయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్​భవన్​ నుంచి బేగంపేట వరకు వాహనాలను నిలువరించారు. ప్రధాని బేగంపేటకు చేరుకున్న అనంతరం రాకపోకలను పునరుద్ధరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.