Modi on Andhra Pradesh Bifurcation : ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే... ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై... చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటులో మైకులు ఆపేసి... ఎలాంటి చర్చ జరగకుండానే ఆంధ్రప్రదేశ్ విభజన చేశారని.. అందుకే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని... మోదీ ఆక్షేపించారు.
PM Modi in Rajya Sabha : : 'ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంటులో మైక్‌లు ఆపేశారు. పెప్పర్ స్ప్రే వాడారు. ఎలాంటి చర్చ జరగలేదు. ఈ విధానం సరైనదేనా..? ఇదేనా ప్రజాస్వామ్యం..? అటల్‌జీ ప్రభుత్వం మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రాల ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు కానీ.. విభజించిన తీరు ఏంటి..? అటల్‌జీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌లను.. ఏర్పాటు చేసింది. అప్పుడు ఎలాంటి గందరగోళం లేదు. శాంతిపూర్వకంగా.. నిర్ణయం జరిగింది. అంతా కూర్చుని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన కూడా అలాగే చేయగలిగేవారం. మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు. అంతా కలిసి చేయగలిగేవాళ్లం. కానీ మీ(కాంగ్రెస్) అహంకారం, అధికార మత్తు.. దేశంలో ఇంత గందరగోళానికి దారి తీసింది. ఆ గందరగోళం వల్లే.. ఇప్పటికీ తెలంగాణ నష్టపోతోంది. ఆంధ్రప్రదేశ్ కూడా నష్టపోతోంది. మీకు ఎలాంటి రాజకీయ లబ్ది కూడా కలగలేదు. మీరా మాకు చెప్పేది.'
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్న మోదీ.. విభజించిన తీరు కాంగ్రెస్ అహంకారం, అధికార మత్తుకు నిదర్శనంగా ఉందని విమర్శించారు.
ఇదీ చూడండి : భాజపాకు గుడ్‌బై.. కాంగ్రెస్ గూటికి త్రిపుర ఎమ్మెల్యేలు