ETV Bharat / state

రాష్ట్రపతికి ప్రభుత్వం ఘనస్వాగతం.. శ్రీశైలానికి బయల్దేరిన ద్రౌపదిముర్ము - President visit to Srisailam

Draupadi Murmu Reached Hyderabad: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరుకున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి హైదరాబాద్​కు వచ్చిన ఆమెకు.. రాష్ట్ర ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం బయలుదేరిన ముర్ము.. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.

Draupadi Murmu reached in Hyderabad
Draupadi Murmu reached in Hyderabad
author img

By

Published : Dec 26, 2022, 11:38 AM IST

Updated : Dec 26, 2022, 11:47 AM IST

Draupadi Murmu Reached Hyderabad: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రి సత్యవతి రాఠోడ్‌ స్వాగతం పలికారు. శంషాబాద్‌ నుంచి రాష్ట్రపతి నేరుగా హెలికాప్టర్‌లో శ్రీశైలం బయలుదేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై రాష్ట్రపతితో కలిసి శ్రీశైలం వెళ్తున్నారు.

శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో రాష్ట్రపతి పూజల్లో పాల్గొంటారు. అనంతరం శ్రీశైలంలో ‘ప్రసాద్‌’ పథకంలో భాగంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. శ్రీశైలం నుంచి ఇవాళ సాయంత్రం హకీంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకుంటారు.

రాష్ట్రపతికి ప్రభుత్వం ఘనస్వాగతం.. శ్రీశైలానికి బయల్దేరిన ద్రౌపదిముర్ము

ఇవీ చదవండి: రైళ్లలో చోటేది స్వామీ!: రిజర్వేషన్‌ దొరక్క అయ్యప్ప భక్తుల ఆందోళన

మహాత్మా గాంధీ సహా మాజీ ప్రధానులకు రాహుల్​ గాంధీ నివాళి

Last Updated : Dec 26, 2022, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.