Precautions While Applying New Passport : పాస్‌పోర్టు కావాలంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేంది. కానీ ఆ తర్వాత ఆన్లైన్లో త్వరితగతిన ఎంతో వేగంగా అర్హుతైన వారికి పాస్‌పోర్టు(Passport) వస్తుంది. పాస్‌పోస్టు పొందాలంటే దరఖాస్తు(Passport Applying) చేసుకునేటప్పుడు తప్పులు లేకుండా చేయాలి. కానీ అలా చేయడం లేదు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలో సాధారణ, తత్కాల్‌తో కలిపి ప్రతిరోజూ 3,800కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కొంత మంది అవగాహన లోపం, సర్టిఫికేట్లు, దరఖాస్తును నమోదు చేసేటప్పుడు పొరపాట్లు, ఆధార్‌లో తేడాలుండటం వంటి అనే సమస్యలు వస్తాయి.
దీంతో ఆ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇలా వచ్చిన దరఖాస్తుల్లో 10 శాతం తిరస్కరణకు గురవుతున్నాయి. విదేశాలకు వెళ్లేవారికి ఇది మరింత నష్టాన్ని తెచ్చి పెడుతోంది. ఇలా అలాంటి సమస్యలు చెక్ పెట్టేందుకు వనరులున్నా.. దరఖాస్తుదారుల్లో అవగాహన మాత్రం కొరవడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు పాస్‌పోర్టు సేవల విభాగం తగిన జాగ్రత్తలు సూచిస్తుంది. ఇప్పుడు ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.
పెట్టీ కేసైనా సరే.. పాస్‌పోర్టు రాదు.. ఉద్యోగాలూ కష్టమే!!
ఎడిట్ ఆప్షన్ లేకపోయినా.. సరే కొన్ని ప్రత్యేక పద్ధతులు : చాలా మంది హడావిడిగా పాస్‌పోర్టు కోసం దరఖాస్తులను నింపుతారు. దీంతో పొరపాట్లు జరుగుతుంటాయి. ఈ తప్పులను సరిదిద్దు కోవడానికి వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ అనేది లేకపోవడంతో.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఎడిట్ ఆప్షన్‌తో సంబంధం లేకుండా ధ్రువపత్రాల పరిశీలన, సమర్పణ సమయంలో వాటిని కూడా ఎడిట్ చేసుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు.
పాస్‌పోర్టు దరఖాస్తు నమోదులో తీసుకునే జాగ్రత్తలు :
- ఎడిట్ ఆప్షన్ లేకపోవడం వల్ల దరఖాస్తులు నింపేటప్పుడు పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి.
- ఏఆర్ఎన్, ధ్రువపత్రాలు సమర్పించే సమయంలో అదనపు కాపీలను దగ్గర ఉంచుకోవాలి.
- ఏవైనా పొరపాట్లు జరిగిన చోట పెన్సిల్‌తో మార్క్ చేయాలి.
- ఇలా మార్క్ చేయడం వల్ల ధ్రువపత్రాలు పరిశీలించి మార్పు చేయాలని కోరవచ్చు.
- అప్పుడు అధికారులు ఒరిజినల్స్‌ను పరిశీలించి అక్కడికక్కడే సరిదిద్దుతారు.
ట్విటర్ వేదికగా... త్వరితగతిన పరిష్కారాలు..
- దరఖాస్తు, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినా పాస్‌పోర్టు డిస్పాచ్‌లో పొరపాట్లు.
- పోలీస్ వెరిఫికేషన్ పూర్తయినా ఇంకా సమాచారం తెలపకపోవడం.
- ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు త్వరగా పరిష్కారం.
- అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా ట్విటర్లో వెంటనే పరిష్కారం.
ఈ తప్పులు చేశారో.. పాస్‌పోర్టు రావడం కష్టమే
ఈసీఆర్ నుంచి నాన్ ఈసీఆర్‌కు..
- ఈసీఆర్(ఇమ్మిగ్రెంట్ చెక్ రిక్వైర్డ్) : పదో తరగతిలోపు చదివిన, అక్షరజ్ఞానం లేని వారికి ఈ పాస్‌పోర్టు ఇస్తారు.
- ఈసీఎన్‌ఆర్ (ఇమ్మిగ్రెంట్ చెక్ నాట్ రిక్వైర్డ్) : పదో తరగతి ఆపై చదువుకున్న వారికి ఈ పాస్‌పోర్టు ఇస్తారు.
ఈసీఆర్ నుంచి నాన్ ఈసీఆర్‌కు పాస్‌పోర్టు మారాలంటే..
- కొందరు పదో తరగతి మెమోలు తదితరాలు సమర్పించకుండా కేవలం ఆధార్‌కార్డును మాత్రమే సమర్పించి దరఖాస్తు చేస్తారు.
- ఇలా చేయడం వల్ల ఈసీఆర్ పరిధిలోకి పాస్‌పోర్టు వస్తుంది.
- పాస్‌పోర్టు చేతిలోకి వచ్చాక విదేశాలకు వెళ్లాలంటే అది పనికి రాదు.
- వెంటనే ఈసీఎన్‌ఆర్ పాస్‌పోర్టు కావాలంటూ అధికారుల చుట్టూ తిరగాలి.
- అందుకే పదో తరగతి కంటే ముందే ఈసీఆర్ పాస్‌పోర్టు తీసుకుంటే వెంటనే ఈసీఎన్ఆర్కు మార్చుకోవాలి.
- ఈ పని గడువు ముగియకముందే మరోసారి రెన్యువల్ లేదా రీఇష్యూ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Passport Services In Hyderabad : పాస్‌పోర్ట్ సేవలు మరింత చేరువ.. ఇక నుంచి తపాలా కార్యాలయాల్లోనూ