గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించింది. నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో మొత్తం 63 మినీ కంటైన్మెంట్ జోన్లను బల్దియా ఏర్పాటు చేసింది. జంట నగరాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా ఈ చర్యలు తీసుకున్నారు. మినీ కంటైన్మెంట్ జోన్ల పరిధిలో అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
ఆయా ప్రాంతాల్లో నిరంతరం శానిటైజేషన్తో పాటు... వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. ఒక్క ఏరియా పరిధిలో 5 కేసుల కంటే ఎక్కువగా ఉంటే మినీ కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. ఒకే అపార్ట్మెంట్లో కరోనా కేసులు వస్తే హౌజ్ క్లస్టర్లుగా బల్దియా ఏర్పాటు చేస్తోంది.
ఇదీ చదవండి: 'ఆక్సిజన్, టీకాలు, రెమ్డెసివిర్ విషయంలో కేంద్రం వివక్ష'