ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు వేతన సవరణ అమలుకానుంది. ఈ మేరకు 2020 పీఆర్సీని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, పీజీటీ, టీజీటీల వేతనాలు పెరగనున్నాయి.
ప్రిన్సిపల్స్ వేతన స్కేల్‌ను రూ. 58,850-1,37,050 రూపాయలుగా, పీజీటీల స్కేలును 45,960 - 1,24,150 రూపాయలుగా, టీజీటీల వేతన స్కేలు 42,300 - 1,15,270 రూపాయలుగా ఉండనుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. వేతనాల పెంపుతో 194 ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న 3000 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరనుంది.
పీఆర్సీ అమలు చేసినందుకు టీఎస్ యూటీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీచూడండి: CM KCR Speech: 'కేసీఆర్ ఏదనుకుంటే అది కావాల్సిందే.. ఎలా ఆపుతారో నేనూ చూస్తా..'